దశాబ్దాల సమస్యలకు బీజేపీ పరిష్కారం చూపింది: లక్ష్మణ్

laxman
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల గ్రామ శివారులో బీజేపీ కార్యాలయానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ భూమి పూజ చేశారు. త్వరలో 8 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూమిపూజ చేస్తామన్నారు. ఇప్పటికే దేశంలో చాలాచోట్ల బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. సిద్ధిపేటలోనూ బీజేపీ బలపడుతోందని అన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి పనులకు, నిర్ణయాలకు ప్రజల మద్దతు లభిస్తోంది అన్నారు. దేశంలో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించింది కూడా తమ పార్టీనే అన్నారు లక్ష్మణ్‌. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్య ఆర్టికల్‌ 370, రామ మందిర నిర్మాణం బీజేపీ ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తు చేశారు.

TV5 News

Next Post

ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడేది లేదు: పవన్

Tue Nov 12 , 2019
వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. సీఎం జగన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన పవన్.. తానూ అదే రీతిలో మాట్లాడితే తలెత్తుకోగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదన్న జనసేనాని.. విజయవాడ రోడ్లపైనే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తే.. అందుకు రెడీగా ఉన్నామంటూ సవాల్ విసిరారు. వైసీపీ, జనసేన మాటల యుద్ధం పీక్‌స్టేజ్‌కు చేరింది. విజయవాడలో […]