మృత్యుంజయుడైన 19 రోజుల పసికందు

3 తరాలకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకున్న డెంగీని..19 రోజుల పసికందు జయించాడు. ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో.. గత 17 రోజులుగా మృత్యువుతో పోరాడిన సోనీ-రాజగట్టు దంపతుల రెండో కుమారుడి ప్రాణాలను వైద్యులు నిలిపారు. నెల రోజుల క్రితం మంచిర్యాలలో ఓ కుటుంబాన్ని డెంగీ మహమ్మారి ఛిన్నాభిన్నం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో దంపతులు సోనీ-రాజగట్టుతో పాటు వారి పాప శ్రీవర్ధిని కూడా ఉంది. అలాగే రాజగట్టు తాత లింగయ్య కూడా డెంగీకి బలయ్యాడు.

నిండు గర్భిణిగా ఉన్న సమయంలో సోనీకి డెంగీ వచ్చింది. ఆ మహమ్మారి కడుపులో ఉన్న చిన్నారికి కూడా సోకింది. పండంటి బాబుకు జన్మనిచ్చిన తర్వాత సోనీ చనిపోయింది. అప్పటి నుంచి డెంగీతో పోరాడిన ఆ చిన్నారిని.. వైద్యులు క్షేమంగా కాపాడటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

TV5 News

Next Post

క్లీన్ హైదరాబాద్ కోసం.. జీహెచ్ఎంసీ ఈ-ఫైన్

Wed Nov 20 , 2019
గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ ఫ్లెక్సీల తొలగింపు డ్రైవ్ కొనసాగుతోంది. అక్రమ బ్యానర్లు, పోస్టర్లను కూడా తీసేస్తున్నారు. మంగళవారం నుంచి దాదాపు 15వేలకు పైగా ఫ్లెక్సీలను తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగం తెలిపింది. అటు ఈ అక్రమ బ్యానర్లను నివారించేందుకు.. కొత్తగా ఈ-ఫైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తోంది జీహెచ్‌ఎంసీ. అయితే ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఫ్లెక్సీలతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే […]