అండర్సన్ గూబ గుయ్యిమంది..

james-anderson-golf-outing-became-worst

ఎప్పుడు క్రికెట్ ఆడితే మజా ఏముంటుంది.. ఈసారి గోల్ఫ్ ఆడుదాం అనుకున్నాడు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు అండర్సన్. అంతే అనుకున్నదే తడవుగా సహచర ఆటగాడు బ్రాడ్‌ తో కలిసి బకింగ్‌హమ్‌షైర్‌లోని ఓ గోల్ఫ్‌ కోర్సుకు వెళ్లారు. అక్కడ అండర్సన్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా.. బ్రాడ్‌ వెనకాలే ఉండి వీడియో తీస్తున్నాడు. ఇంతలో ఆండర్సన్ గోల్ఫ్‌ స్టిక్‌తో బంతిని బలంగా కొట్టగా.. కింద ఉన్న ఓ చెక్క ముక్క తగిలి బంతి తిరిగి అండర్సన్‌ చెవి, ముఖానికి మధ్య ప్రదేశంలో తాకింది. దెబ్బ గట్టిగ తగలడంతో అండర్సన్‌ విలవిలలాడిపోయాడు. కాగా వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చెయ్యడంతో అది కాస్త వైరల్ గా మారింది.

-ADVT-