అరంగేట్రం చేసిన రోజే కెరీర్‌కు క్రికెటర్ గుడ్‌బై

టీమిండియా మీడియం ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ కెరీర్ కు గుడ్‌బై చెప్పారు. ఇప్పటివరకు ఆర్పీ సింగ్ 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆర్పీ మంగళవారం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. తన కెరీర్ లో జరిగిన విషయాలను ఓ లేఖ ద్వారా పంచుకున్న ఆర్పీ”13 ఏళ్ళ క్రితం నేను భారత్ జెర్సీని ధరించాను. ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలుగా మారడానికి ఆరోజే పునాది పడింది. ఈ రోజు నా క్రికెట్ కెరీర్ కు గుడ్‌బై చెప్పాను .ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అంటూ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఆర్పీ చివరిగా 2011 సెప్టెంబర్ 16 న కార్డిఫ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 40, వన్డేల్లో 69, టీ20ల్లో 15 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 82 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు తీశాడు. సరిగ్గా టీమిండియాలోకి అరంగేట్రం చేసిన రోజే (సెప్టెంబర్ 4, 2015)క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం.

-ADVT-