బావిలో ఇరుక్కున్న పులి పిల్లల్ని రక్షించాలని చూశాడు.. చివరకు ఏమైందో వీడియో చూడండి

leopard arives form both sides

సహజంగానే పులి అంటే మనుషులకు ఎక్కడలేని భయం. అది ఒక్కసారి పంజా విసిరి దాడి చేసిందంటే ఎంతటి వారినైనా వదిలిపెట్తదు.. అలాంటి క్రూర జంతువునే కాపాడటానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి. అయితే అది పులి కాదు.. దాని పిల్లలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.. అడవికి దగ్గరగా వుండే గ్రామంలో పాడుబడ్డ భావి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ బావిలోకి నీరు చేరింది. ప్రమాదవశాత్తు ఆ బావికి లోపల ఉన్న అంచులోరెండు పులిపిల్లలు చిక్కుకున్నాయి. బయటికి ఎలా రావాలో అర్ధంకాక పెద్దగా గ్రాండించడం మొదలుపెట్టాయి. బావినుంచి అరుపులు రావడంతో గ్రామస్తులు గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి భావి అంచుకు వెళ్ళాడు. అయితే పులికి ఉన్న సహజ గుణం అవతలివారిని బెదిరించడం. ఆ గుణంతోనే అవి పిల్లలైనా ఆ వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నించాయి. పులిపిల్లల ఎదిరింపు చూసిన సదరు వ్యక్తి వెంటనే పైకి వచ్చేశాడు. ఈసారి పక్కా ప్లాన్ అమలుచేశాడు. కర్రకు మెడఉచ్చు అమర్చి వాటిని పైకి లాగారు. అనంతరం వాటిని బోనులో బంధించి వారి వెంట తీసుకెళ్లారు. ఇక పులిపిల్లల బాధ వదలడంతో గ్రామస్థులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.