LIVE : శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ధ్వజారోహణతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు.

అంతకుముందు బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌.. అఖిలాండం వద్ద పూజలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం తలకు పరివస్త్రం చుట్టి పట్టు వస్త్రాలను తలపై ఉంచి.. ఆలయ మర్యాదలతో మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

 

-ADVT-