పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళను లోబర్చుకున్న యువకుడు

పెళ్ళి చేసుకుంటునాని చేప్పి మహిళను మోసం చేసినా ఓ యువకుడికి న్యాయస్థానం ఏడేండ్ల జైలుతో పాటు జరిమానా విధించింది. బడీచౌడి ప్రాంతానికి చెందిన దుర్గేష్ నందిని భర్తతో వచ్చిన విభేదాల కారణంగా అతనితో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో తరుచుగా ఇంటికి వచ్చే కుటుంబ స్నేహితుడు సూరజ్‌కు ఆమెపై కన్నుపడింది. వివాహం చేసుకుంటానని చేప్పి ఆ మహిళను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో నందిని గర్భం దాల్చింది. అయితే సూరజ్ మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.దీంతో ఆమె 2014లో సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగెళ్ళ పాటు న్యాయస్థానంలో విచారణ జరుగగా బుధవారం నాంపల్లి రెండవ ఏసీఎంఎం తీర్పునిచ్చింది. నిందితుడికి ఏడేండ్ల జైలు, రూ. 5వేల జరిమానా విధిస్తూ కోర్ట్ తీర్పును వెల్లడించింది.

-ADVT-