సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

cm chandrababunaidu open letter to people over titly cyclone

తిత్లీ తుపాను బాధితులకు సాయం చేయాలని ప్రజలకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. శ్రీకాకుళం ఎన్నడూలేనంతగా అల్లకల్లోలమైందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యానవనంలాంటి ఉద్దానం దెబ్బతిన్నదని, నష్టంతో దశాబ్దాలు వెనక్కి పోయిందని చెప్పారు. 3 వేల 428 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశామన్నారు. సాయం చేయాల్సిన కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని, రెండుసార్లు లేఖలు పంపినా స్పందన కరువైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ పాదయాత్ర నేడు మధ్యాహ్నం వరకే.. ఆ తరువాత..

‘ఎన్టీఆర్’ వెనుక భరత్ రెడ్డి…

ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః చంద్రబాబు

ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల్ని శ్రీకాకుళంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిందని, ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఐఏఎస్‌లు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఉక్కు సంకల్పంతో, మనోనిబ్బరంతో హుద్‌హుద్‌ను జయించామన్నారు. తుపాను విధ్వంసం నుంచి శ్రీకాకుళం జిల్లా తేరుకునేందుకు తూర్పు అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడతామని, తుపాను బాధిత ప్రాంతాలన్నీ పునర్నిర్మించాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, ఆర్థిక స్థోమత కలిగిన కంపెనీలు, ప్రవాసాంధ్రులు, ప్రజలు ఆర్థిక చేయూత ఇవ్వాలని చంద్రబాబు లేఖ ద్వారా పిలుపునిచ్చారు. అటు.. తిత్లీ తుపానుపై కేంద్రానికి ఏపీ అధికారులు మరోసారి నివేదిక అందించారు. తుపాను ప్రభావతంతో తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో జాతీయ విపత్తుగా ప్రకటించి.. కేంద్ర బృందాలను పంపించాలని పీఎంవో అధికారులను కోరారు. తుపాను సాయంపై ప్రధానికి సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండు లేఖలు రాశారు. కేంద్రం తక్షణ సాయంగా 12 వందల కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.