పదవతరగతి అర్హతతో ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..

దేశంలోని వివిధ సబ్సిడరీ ఇంటిలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కేంద్ర హోంమత్రిత్వ శాఖ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1054 (తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 20, తెలంగాణలో 36 పోస్టులు ఉన్నాయి)
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.
ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరి. ఇంటిలిజెన్స్ వర్క్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయసు: 27 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
రెండు దశల్లో జరిగే ఈ రాత పరీక్ష మొదటి దశలో జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించిన ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేస్
అంశాలపై ప్రశ్నలు ఇస్తారు.
రెండో దశలో డిస్క్రిప్షన్ పేపర్ ఉంటుంది.
పే స్కేల్: రూ.5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులు ఉంటాయి.

టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు.. డబుల్ శాలరీతో బంపర్ ఆఫర్
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ సహా దేశ వ్యాప్తంగా 34 సెంటర్లలో నిర్వహిస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.10.2018
దరఖాస్తుకు చివరి తేదీ: 10.11.2018
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 13.11.2018
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ : https://mha.gov.in/