డబ్బు ఖర్చు పెట్టే ఆర్థిక స్థోమత లేక.. ఈ విధంగా ప్లాన్ చేశా

దర్శకుడు రవిబాబు పందిపిల్లతో పాదయాత్ర చేశారు. తన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆయన హైదరాబాద్‌లోని KBR పార్క్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకూ నడుచుకుంటూ వెళ్లారు. ” అదిగో” పేరుతో ఆయన ఓ సినిమా తీశారు. ఇందులో “పందిపిల్ల బంటీది” కీ రోల్. ప్రీరిలీజ్ ఈవెంట్‌కి డబ్బు ఖర్చు పెట్టే ఆర్థిక స్థోమత లేక.. ఈ విధంగా వినూత్నంగా ప్లాన్ చేశామన్నారు రవిబాబు. ఈ సినిమా ఈ నెల 7వ తేదీన రిలీజ్ అవుతోంది. తొలిసారి లైవ్ యాక్షన్ 3D యానిమేషన్ ఇందులో చూపిస్తున్నామన్నారు.