చంద్రబాబు తెలంగాణను ముంచే ప్రయత్నం చేస్తున్నారు:కేటీఆర్‌

ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ దూకుడు చూపిస్తున్నారు.. ఓ వైపు ఆశీర్వాద సభలు, మరోవైపు కార్యకర్తలతో భేటీ, రోడ్‌ షోలు, బహిరంగ సభలు ఇలా దూసుకుపోతున్నారు. మరోవైపు కులాలు, సామాజిక వర్గాల వారిగా భేటీలతో బిజీ అవుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నెక్లెస్‌ రోడ్డులోని ఓ పార్క్‌లో బ్రహ్మణ సంఘాలతో భేటీ అయ్యారు.

రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరికీ టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశం మొత్తంలో ట్రెజరీ నుంచి.. పురోహితులకు జీతాలు ఇస్తోంది కేవలం తెలంగాణలోనే అని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపైనా కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. తెలంగాణను చంద్రబాబు ముంచే ప్రయత్నం చేస్తున్నారని, ఏపీలో సమస్యలు వదిలి.. తెలంగాణ మీద పడుతున్నారని ఆరోపించారు..