తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయడంలో తనవంతు కృషి చేస్తానన్నారు కేంద్ర హోమ్‌శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి... ముఖ్యంగా తెలంగాణలో పార్టీని మరింత పటిష్టపరచాల్సిన అవసరముందన్నారు... స్థానిక నాయకత్వం ప్రజలు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరముందన్నారు... పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలంటూ ఏవీ ఉండవని... అంతా సమష్టిగా తీసుకున్న నిర్ణయాలనే అమలు పరుస్తామన్నారు కిషన్‌రెడ్డి... అలాగే 2023 నాటికి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసి అసెంబ్లీపై కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు...

తమ పార్టీకి ఒకరాష్ట్రం ఎక్కువ.. మరో రాష్ట్రం తక్కువ అన్న భావన లేదన్నారు కిషన్‌రెడ్డి... అన్ని రాష్ట్రాలను తాము సమానంగా చూస్తామని.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని అని అన్నారు... ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రంపట్ల వివక్ష చూపబోమన్నారు... తమ పార్టీ ప్రాతినిథ్యం లేకపోయినా ఆ రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు... ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇస్తుందని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి...

స్థానిక ఎన్నికల్లో డబ్బు, అధికార దుర్వినియోగం ప్రభావం చూపిస్తాయన్నారు కిషన్‌ రెడ్డి... అందుకే స్థానిక ఎన్నికలు వేరు... చట్ట సభల ఎన్నికలు వేరనితెలిపారు... ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని... ఖచ్చితంగా దానిని తమకు అనుకూలంగా మలచుకొని తెలంగాణలో బలపడతామంటున్నారు కిషన్‌రెడ్డి...

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే విధానం అవలంభిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి... తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎలా దూరం పెట్టామో... అటు ఏపీలో వైసీపీని కూడా అంతే దూరం పెడతామన్నారు... తమ ముందు రెండు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టపరచాల్సిన అవసరముందన్నారు...

ఇక తనను అమిత్‌షా మందలించారన్న విషయంలో నిజం లేదన్నారు కిషన్‌రెడ్డి... ఆ రోజు తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు... ఉగ్రవాదానికి హైదరాబాద్‌ ఒక బీడింగ్‌ సెంటర్‌గా ఉందని దానిని నియంత్రించాల్సిన అవసరముందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story