నాకు ఇప్పుడు 66వ నెల.. ఇది ఇంకెప్పుడు పూర్తవుతుందో

నాకు ఇప్పుడు 66వ నెల.. ఇది ఇంకెప్పుడు పూర్తవుతుందో

ఒకప్పుడు వారి జీవితంలోని మధురక్షణాలను డైరీలో అక్షర రూపంలో రాసుకునేవారు... కానీ ఇప్పుడు ఆనందపు క్షణాలను కెమెరాలో బంధించడం నిత్యకృత్యమైపోయింది. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా భావించే పెళ్లి సమయంలో అయితే ఈ ట్రెండ్ మరీ ఎక్కువ. ఇంట్లో బంధువుల సందడి కంటే ఫోటో గ్రాఫర్స్ హడావుడే ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు ఫ్రీ వెడ్డింగ్ షూట్, బేబి షూట్‌, న్యూబోర్న్ అండ్ కిడ్స్ ఫొటోషూట్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ప్రపంచం మెుత్తం ఈ ట్రెండ్ పాకిపోయింది. తాజాగా జార్జియాకు చెందిన సారా వీలెన్‌ కర్టిస్‌ అనే మహిళ కూడా ఇలాంటి ఫోటోషూట్‌తో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఫేమస్‌ అయ్యారు. తన మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పుట్టబోయే బిడ్డను ఊహించుకుంటూ ఆ ఙ్ఞాపకాలను భద్రపరుచుకోవాలనుకున్నారు. దీనికి ఓ ఫొటోషూట్ ప్లాన్ చేశారు.

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మీరు అనుకుంటున్నట్టుగా సారా గర్భవతి కాదు. కానీ ఆమె మాత్రం అచ్చం బేబీ బంప్‌ షూట్‌లాగే ఓ షూట్ చేసి్ంది. బంప్‌ లేకుండా ఆ షూట్ ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. ఆమె తన బిడ్డలా భావించే పీహెచ్‌డీ థీసిస్‌తో ఆమె ఫొటోషూట్‌ నిర్వహించారు. ఈ ఫోటో షూట్‌లో తీయించుకున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ నేను నా థీసిస్‌తో ఫొటోషూట్‌ చేశాను.ఇది నా కృషికి ఫలితం' అని ట్వీట్‌ చేసి.. పీహెచ్‌డీ లైఫ్‌ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే 66 వేలకు పైగా లైకులు వచ్చాయి. రకరకాల కామెంట్స్‌తో నెటిజన్స్ ఆమె పోస్ట్‌పై స్పందిస్తున్నారు."ప్రస్తుతం నేను 66వ నెలలో ఉన్నాను, నాదెప్పుడు పూర్తి అవుతుందో" అంటూ ఓ పీహెచ్‌డీ స్కాలర్‌ కామెంట్‌ చేశాడు. అలాగే మరికొంత మంది నెటిజన్స్ స్పందిస్తూ"సాధారణంగా డాక్టర్లు బిడ్డ పుట్టాక తల్లి చేతిలో పెడతారు. కానీ మీరు మాత్రం బిడ్డగా భావించే పట్టాలను అందుకున్న తర్వాత డాక్టర్‌ అయ్యారు" అని చమత్కరిస్తున్నారు. ఎపిజెనెటిక్‌ వేరియేషన్‌ అండ్‌ ఎక్స్‌పోజర్‌ టు ఎండోక్రైన్‌ డిస్రప్టింగ్‌ కాంపౌండ్స్‌( జన్యు పరిణామక్రమంలో సంభవించే సంక్రమిత మార్పులు-వాటికి దారితీసే అంశాలు)లపై సారా పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story