రోగి గుండెల్లో మంటలు.. సర్జరీ చేస్తున్న డాక్టర్లు షాక్..

రోగి గుండెల్లో మంటలు.. సర్జరీ చేస్తున్న డాక్టర్లు షాక్..

గుండెల్లో మంటగా ఉందంటూ రోగులు డాక్టర్లని సంప్రదిస్తుంటారు. కంటికి కనిపించని ఆ మంటలకి జెలూసిల్ లాంటి సిరప్ ఏదో ఇచ్చి ఇంటికి పంపిస్తుంటారు వైద్యులు రోగులని. నిజంగానే మంటలు భగ్గుమని గుండెలో నుంచి వస్తుంటే.. సర్జరీ చేస్తున్న డాక్టర్లు కూడా షాకయ్యే పరిస్థితి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని ఓ 60 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చాడు. రోగిని పరిశీలించిన డాక్టర్లు అతడి కుడివైపు ఊపిరితిత్తులు ఉబ్బి పక్కటెముకల్లో నొప్పి వస్తుందని గుర్తించారు. నొప్పి తగ్డడానికి సర్జరీ ఒక్కటే మార్గం అన్నారు. అందుకోసం ఊపిరితిత్తుల్లో ఒకదానికి రంథ్రం చేసి గుండెకు సర్జరీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇంతలో రోగి తీసుకుంటున్న గాలి ఆ రంథ్రం నుంచి బయటకు వచ్చేస్తుండడంతో ఆక్సిజన్ మాస్క్ నుంచి ఎక్కువ గాలిని వదిలారు. అదే సమయంలో గుండె వద్ద అనస్తేటిక్ లీకైంది. సర్జరీ చేస్తున్న వైద్యులు ఆ విషయాన్ని గుర్తించకుండా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సర్జరీ తాలూకూ ఉపయోగించిన ఓ ఎలక్ట్రికల్ పరికరం నుంచి నిప్పులు వచ్చాయి. ఆ నిప్పులకు రోగి పీల్చిన ఆక్సిజన్ తోడై అనస్తేటిక్ మండింది. దీంతో వైద్యులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. వైద్యులు అప్రమత్తంగా ఉండడంతో రోగికి ప్రాణ హాని తప్పింది. విజయవంతంగా సర్జరీ పూర్తి చేసిన వైద్యులు రోగి కోలుకున్నాక అతడిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story