మా నాన్నకు జాబ్ ఇప్పించరూ.. ప్లీజ్.. మోదీకి లేఖ రాసిన బాలుడు

మా నాన్నకు జాబ్ ఇప్పించరూ.. ప్లీజ్.. మోదీకి లేఖ రాసిన బాలుడు

చిన్నారులు చేసే పనులు ఒక్కోసారి ముచ్చటేస్తాయి. ఒక్కోసారి కంటతడి పెట్టిస్తాయి. మరోసారి ఆలోచింపజేస్తాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యజిత్‌ విజయ్‌ త్రిపాఠి కుమారుడు చేసిన పని కూడా చాలా మందిని కదిలించింది. మా నాన్నకు జాబ్ ఇప్పించరూ.. ప్లీజ్.. అంటూ ప్రధాని మోదీకి ఆ పిల్లాడు రాసిన లేఖ వైరల్‌గా మారింది. సత్యజిత్ త్రిపాఠీ యూపీ స్టాక్ ఎక్స్చేంజీలో పని చేసేవారు. అనూహ్యంగా 2016లో ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయారు. దాంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఈ విషయం గమనించిన సత్యజిత్ కుమారుడు సార్దక్‌, తమ ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాడు. మోదీకి లేఖ రాసి, తమ బాధలను ఏకరవు పెట్టాడు. కొంతమంది తన నాన్నను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని, ఈ విషయంలో తమకు సాయం చేయాలని ప్రధానిని కోరారు.

మోదీకి సార్దిక్ లేఖ రాయడం ఇది 37వ సారి. 2016 నుంచి ప్రధానికి సార్దక్ లేఖలు రాస్తూనే ఉన్నాడు. 36 లేఖల్లో ఒక్క లెటర్‌కు కూడా సమాధానం రాలేదు. ఐనప్పటికీ పట్టు వీడకుండా మరోసారి లేఖ రాశాడు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి అభినందనలు తెలుపుతూనే, తన ఇంట్లో పరిస్థితిని వివరించాడు. మోదీ ఉంటే సాధ్యం కానిది ఏమీ లేదని చాలా మంది అంటుంటే విన్నానని, అందుకే సాయం కోరుతూ మోదీకి లేఖ రాశానని సార్దికి చెబుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story