మోదీకి ఘన స్వాగతం

మోదీకి ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ... రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్‌ నరసింహన్‌, సీఎం జగన్‌,కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.... ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ నేతలు ,బీజేపీ నాయకులు పలువురు మోదీకి స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి మోదీ.. బహిరంగ సభ జరిగే ప్రాంగణానికి బయల్దేరారు.

బహిరంగసభ తర్వాత ప్రధాని మోదీ రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు. పద్మావతి అతిథి గృహాంలో కాసేపు విశ్రాంతి తర్వాత ఆరు గంటల సమయంలో వరాహస్వామి దర్శనం చేసుకుంటారు. 6 గంటల 15 నిమిషాలకు శ్రీవారి దర్శించుకుంటారు. 7 గంటల 20 నిమిషాలకు తిరుమల నుంచి బయల్దేరి 8 గంటల పది నిమిషాలకు ఢిల్లీ బయల్దేరుతారు. మోదీకి వీడ్కోలు పలికాక గవర్నర్, సీఎం జగన్ కూడా అక్కడి నుంచి తిరుగుపయానం అవుతారు.

ప్రధాని మోదీ తిరుమల పర్యటన నేపథ్యంలో భద్రతా కట్టుదిట్టం చేశారు. అడుగడునా నిఘా పెంచారు. తిరుపతి, తిరుమలో భారీగా పోలీసుల, భద్రతా దళాలు మోహరించాయి. తిరుమల కొండపైన మోదీ విశ్రాంతి తీసుకునే పద్మావతి అతిథి గృహాన్ని ఇప్పటికే ఎస్పీజీ అధీనంలోకి తీసుకుంది. సమీప ప్రాంతాల్లో ఉన్న రెస్ట్ హౌస్‌లను యాత్రికులకు కేటాయించడాన్ని ఆపేశారు. అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు, అడుగడుగునా పోలీసులు మోహరించారు. ఘాట్ రోడ్డులో కూంబింగ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ప్రధాని పర్యటన మార్గాల్లోని దుకాణాలన్నీ మూసివేయాలని ఇప్పటికే వ్యాపారస్తులకు ఆదేశించారు.

అంతకుముందు... రేణిగుంట ప్రాంతంలో ఈదులుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలివాన ధాటికి బీజేపీ ప్రజా ధన్యవాద సభలో షెడ్లు కూలిపోయాయి. బీజేపీ ఫ్లెక్సీలు, జెండాలు కొట్టుకుపోయాయి. కార్యకర్తలు ఎప్పటికప్పుడు వాటిని సరిచేసేందుకు ప్రయత్నించారు.

Tags

Read MoreRead Less
Next Story