మేం ఉన్నాం చెల్లెమ్మా అంటూ 50 మంది..

మేం ఉన్నాం చెల్లెమ్మా అంటూ 50 మంది..

అమ్మానాన్న అన్నీ తానై నిలుస్తానన్న అన్న వీరమరణం పొందాడు. ఉన్న ఒక్కగానొక్క అన్న చెల్లెలి పెళ్లి చూడకుండానే వెళ్లి పోయాడు. రక్తం పంచుకు పుట్టిన అన్న లేకపోవచ్చు. మేం కూడా నీకు అన్నలమే తల్లీ అంటూ ప్రకాశ్ సహచర కమాండోలైన 50 మంది పెళ్లికి వచ్చి శశికళను ఆశీర్వదించారు. హరియాణా రోహ్‌తక్ జిల్లాకు చెందిన ఎయిర్‌ఫోర్స్ గార్డు యూనిట్ కమాండో జ్యోతి ప్రకాశ్ ఏడాదిన్నర క్రితం జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశ్ సాహసాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అశోక చక్ర ప్రకటించింది. కాగా ప్రకాశ్‌కి ఇద్దరు అక్కలు, ఒక చెల్లి ఉన్నారు. చిన్న కుమార్తె శశికళ వివాహం చేయదలచారు ప్రకాశ్ తండ్రి తేజ్ నారాయణ్ సింగ్

శశికళ వివాహానికి హాజరు కమ్మంటూ కమాండో యూనిట్‌కి ఆహ్వానాలు పంపారు. ఊహించని విధంగా 50 మంది ఐఏఎఫ్ కమాండోలు శశికళ వివాహానికి హాజరయ్యారు. రెండ్రోజుల ముందే వచ్చి వివాహ వేడుకల ఏర్పాట్లలో భాగస్వాములయ్యారు. అందరూ కలిసి తలా కొంత వేసుకుని రూ.5 లక్షలతో చెల్లి పెళ్లి ఘనంగా జరిపించారు. తమదంతా ఒకే కుటుంబం అని లోకానికి చాటి చెప్పారు ఐఏఎఫ్ కమాండోలు.

Tags

Read MoreRead Less
Next Story