అర్థరాత్రి నడిరోడ్డుపై మాజీ మిస్‌.. ఆమెని చూసిన యువకులు..

అర్థరాత్రి నడిరోడ్డుపై మాజీ మిస్‌.. ఆమెని చూసిన యువకులు..

అమ్మాయి కనిపిస్తే చాలు ఆబగా చూసే పోకిరీలు.. రక్షక భటులు కదా అని పోలీసులను ఆశ్రయిస్తే ఆ ఏరియా మా పరిధిలోకి రాదంటూ కుర్చీలో కునుకు తీసే పోలీసు. వెరసి ఆమె ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కోల్‌కతాలో సోమవారం రాత్రి మాజీ మిస్ ఇండియా యూనివర్స్ ఉష్రోషి సేన్ గుప్తా రాత్రి 11.40 గంటల ప్రాంతంలో జేడబ్ల్యూ మారియట్‌లో విధులు ముగించుకుని సహోద్యోగితో కలిసి ఊబెర్‌‌లో ఇంటికి వెళుతోంది. మార్గ మధ్యంలో బైకుపై వచ్చిన కొందరు యువకులు వీరు ప్రయాణిస్తున్న ట్యాక్సీని అడ్డగించారు. క్యాబ్‌పైకి రాళ్లు వేయడంతో పాటు, డ్రైవర్‌ను బయటకు లాగి కొట్టడం మొదలు పెట్టారు. వెంటనే ఉష్రోషి క్యాబ్ దిగి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయాన్ని వివరించింది.

అక్కడున్న పోలీస్ అధికారి తమ స్టేషన్ పరిధిలోకి రాదని అన్నారు. దాంతో ఉష్రోషి కన్నీటి పర్యంతం అయింది. సరేనంటూ పోలీస్ అధికారి ఆమెతో వెళ్లారు. కానీ ఆకతాయిలు పోలీసుని పక్కకు తోసి పారిపోయారు. గొడవ సద్దుమణిగిందని భావించిన ఉష్రోషి తిరిగి క్యాబ్ ఎక్కి వెళుతోంది. ట్యాక్సీ బయలుదేరిన కొద్ది సమయానికే మళ్లీ ఆ యువకులు క్యాబ్‌ని అడ్డగించారు. ఉష్రోషిపై అసభ్యంగా ప్రవర్తించారు. దాడి ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ గట్టిగా అరవడంతో ఆకతాయిలు పారిపోయారు.

అక్కడి నుంచి మరో పోలీస్ స్టేషన్‌కి కంప్లైంట్ ఇవ్వాలనుకున్న ఆమెకు అక్కడ కూడా నిరాసే ఎదురైంది. అక్కడి పోలీసులు ఆ ఏరియా తమ పరిధిలోకి రాదన్నారు. హెల్మెట్ లేకుండా బైకులపై తిరగడమే కాకుండా అమ్మాయిలను ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోనట్టు వదిలేయడం భావ్యం కాదన్న ఉష్రోషి ప్రశ్నకు బదులిచ్చేవారే లేరు. ఈ దారుణాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడి చేసింది. అప్పుడు కానీ పోలీసులు అప్రమత్రం కాలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం ఏడుగురిని అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story