లోక్‌సభ, రాజ్యసభల్లో ఆ ఇద్దరూ ఇక కనిపించరా?

లోక్‌సభ, రాజ్యసభల్లో ఆ ఇద్దరూ ఇక కనిపించరా?

ఇద్దరూ..ఇద్దరే..! మహిళా నేతలుగా వాళ్ల రాజకీయ ప్రస్థానం ఎందరికో ఆదర్శం..! అత్యంత కీలకమైన పదవులు నిర్వహించారు. పార్టీపై చెరగని ముద్ర వేశారు. కానీ ఆశ్చర్యంగా ఆ ఇద్దరు సీనియర్ నేతల పొలిటికల్ కెరీర్ కు ఒకేసారి ఎండ్ కార్డ్ పడింది..

ప్రతిపక్ష పార్టీ వాళ్లు అడిగే ప్రశ్నలకు ఛలోక్తులు విసురుతూ సమయస్పూర్తితో సమాధానం చెప్పే విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ గొంతుక ఇక వినిపించదా? మాటకు ముందు, తర్వాత మనస్ఫూర్తిగా నవ్వే లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను ఇక చూడలేమా?. అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు . పార్టీలో వీళ్లిద్దరి ప్రస్థానం అద్భుతం. గత ప్రభుత్వంలో ఒకరు విదేశాంగ శాఖ మంత్రిగా ..మరొకరు లోక్‌ సభ స్పీకరుగా పనిచేశారు..

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సుమిత్రా, సుష్మ స్వరాజ్ ఇద్దరూ పోటీ చేయలేదు. కనీసం రాజ్యసభ ద్వారా అయినా ప్రజలకు మరోసారి చేరువవుతారనుకుంటే అది కూడా జరిగేలా కనిపించడం లేదు. వీళ్లిద్దరూ మాజీ ఎంపీ గుర్తింపు కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రాజ్యసభ నుంచి ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఇక లేనట్లే.

सुषमा स्वराज और सुमित्रा महाजन को राज्यसभा भी नहीं भेजा जाएगा, इस कदम से हो गया साफ

అనారోగ్య కారణాల దృష్ట్యా 2019 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుష్మ ముందే ప్రకటించారు. పార్టీకి మాత్రం సలహాలు సూచనలు ఇస్తానని చెప్పారు. అయితే బీజేపీ భారీ మెజార్టీతో గెలవడంతో ఆమెకు రాజ్యసభ స్థానం దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ సుష్మా స్వరాజ్ మాజీ పార్లమెంటు సభ్యురాలి కార్డుకు దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంతో పార్లమెంట్‌లో సుష్మ ప్రస్థానం ముగిసినట్లే కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ లోని విదిశా నుంచి పలుమార్లు ఎంపీగా ఎన్నికైన సుష్మా.. ఎన్డీఏ1లో విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆమె ఢిల్లీ సీఎంగానూ పనిచేశారు.

సుమిత్రా మహాజన్ మాత్రం గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం తీవ్రంగా శ్రమించారు. ఆఖరి క్షణం వరకు ఎదురు చూశారు. ఆమె ఎప్పుడూ పోటీ చేసే ఇండోర్‌ స్థానం నుంచి టికెట్‌ ఆశించారు. కానీ బీజేపీలో పెట్టుకున్న వయసు నిబంధన కారణంగా పోటీకి దూరమయ్యారు. అయితే అధికారంలోకి వచ్చాక సుమిత్రకు రాజ్యసభ అవకాశం ఇస్తారని భావించారు కానీ అందుకు భిన్నంగా ఆమె పార్లమెంటుకే దూరం కానున్నారు. సీనియర్ నేత అయిన సుమిత్రా మహజన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 16వ లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించారు

Tags

Read MoreRead Less
Next Story