జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ముక్కలవుతోందా..?

జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ముక్కలవుతోందా..?

త్వరలో కర్ణాటక ప్రభుత్వం కూలిపోనుందా..? జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ముక్కలవుతోందా..? తాజాగా మాజీ ప్రధాని దేవగౌడ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ ఆయన అభిప్రాయపడ్డారు..

సంకీర్ణ కూటమిలో ఉండే కష్టాలేంటో తనకు బాగా తెలుసన్నారు దేవేగౌడ. అందుకే కూటమిలో భాగంగా కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలని తాను కోరుకోలేదన్నారు. తన కుమారుడి బదులు మల్లికార్జున ఖర్గేను సీఎంగా చేయమని రాహుల్‌ గాంధీని కోరానని తెలిపారు. అందుకు ఆయన అంగీకరించలేదన్నారు. అంతేకాక కాంగ్రెస్‌ ఒత్తిడి వల్లే కూటమి ఏర్పాటుకు ఒప్పుకున్నాను అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు తీరు ఘోరంగా ఉందన్నారు. సీఎం కుమారస్వామికి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపుసంకీర్ణ ప్రభుత్వంలో చాలా తలనొప్పులున్నాయంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అన్నిటిని తట్టుకుంటూ మంచి పాలన అందిస్తున్నానని కుమారస్వామి చెప్పిన రెండు రోజులకే దేవగౌడ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటకలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఫిబ్రవరి నుంచే కాంగ్రెస్‌-JDS మధ్య లుకలుకలు ఉన్నా.. లోక్‌సభ ఫలితాలతో బంధం మరింత చెడ్డట్టే కనిపిస్తోంది. ఈ మధ్యంతరంపై దేవెగౌడ వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకున్నారు కర్నాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావు. ఎందుకలా అన్నారో దేవెగౌడే చెప్పాలని అన్నారు. తమ పూర్తి మద్దతు జేడీఎస్ ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు దేవగౌడ సైతం తన వ్యాఖ్యలపై యూటర్న్‌ తీసుకున్నారు తాను స్థానిక సంస్థల ఎన్నికల గురించే అలా చెప్పాను అంటూ మాట మార్చారు...

దేవగౌడ వ్యాఖ్యలతో బీజేపీ ఇంకాస్త అలర్ట్‌ అయ్యింది. మరోసారి కర్ణాటకలో ఆపరేషన్‌ కమల్‌కు తెరపుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కని కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీల నాయకత్వాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీలకు చెందిన 20-25 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story