ఆశా వర్కర్లకు గుడ్‌ న్యూస్

ఆశా వర్కర్లకు గుడ్‌ న్యూస్

ఆశా వర్కర్లకు గుడ్‌ న్యూస్‌.. ఏపీలోని ఆశావర్కర్ల జీతం 10 వేలు పెంచుతూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 3 వేల రూపాయల జీతం తీసుకుంటున్నారు ఆశావర్కర్లు.. దీంతో ఒకేసారి ఏడువేల రూపాయలకు వారి జీతం పెరగనుంది. పాదయాత్ర సందర్భంగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. ఆ మాటను వెంటనే నిలబెట్టుకుంటున్నారు. దీంతో ఆశావర్కర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఏపీలో ఆరోగ్య కేంద్రాలు, 108 పనితీరుపై జగన్ ఆరా తీశారు. ఎన్టీఆర్ వైద్యసేవ పేరును డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీగా పేర్చు మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రులు, వైద్య సేవల్లో సంస్కరణలు తేవాలని ఆదేశించారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి జరిగితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.

వైద్యరంగం ప్రక్షళానపై దృష్టి పెట్టిన ఆయన.. ఆరోగ్యశాఖ పనితీరుపై 45 రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాలని కోరారు. 108, 104 సర్వీసులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటు ఆస్పత్రుల కంటే మెరుగ్గా తీర్చిదిద్దాలని కోరారు. మౌలిక వసతులు, వైద్య పరికరాలు, మందుల టెండర్లపై పునఃసమీక్ష చేయాలని అధికారులకు సూచించారు..

Tags

Read MoreRead Less
Next Story