రూ.430లకు కొని.. రూ.6.3 కోట్లకు అమ్మి..

రూ.430లకు కొని.. రూ.6.3 కోట్లకు అమ్మి..

బామ్మోయ్.. ఇది బొమ్మ కాదే దాని అమ్మలా ఉంది. లేకపోతే ఎందుకంత రేటు. ఇదేదో ప్రాచీన కాలానికి చెందిన చదరంగం (చెస్) పావు అట. సుమారు 900 ఏళ్ల కిందటి లెవిస్ చెస్‌మ్యాన్ ఈ పావును 1964లో ఓ వ్యక్తి కేవలం ఐదు పౌండ్ల (రూ.430)కి కొనుగోలు చేశాడు. పురాతన వస్తువులు, పెయింటింగులు, చారిత్రక వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు కొందరు. లండన్ సౌత్‌లైలో మంగళవారం జరిగిన వేలంపాటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ పావును 7.35 లక్షల పౌండ్ల (రూ. 6.3 కోట్ల)కు సొంతం చేసుకున్నాడు. 8.8 సెం.మీ పొడవున్న ఈ పావు 12వ శతాబ్ధంలో తయారైనదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వార్లస్ అనే సముద్ర జంతువు దంతంతో ఈ పావును తయారు చేశారు. క్రీ.శ 800 నుంచి 1066 మధ్యకాలానికి చెందిన ఈ కళాకృతులు ఎంతో విశిష్టమైనవి. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. 1831 నుంచి అనేక మంది చేతులు మారి చివరకు లండన్‌లో వేలం పాటకు వచ్చి కోట్లలో ధర పలికింది.

Tags

Read MoreRead Less
Next Story