అమ్మా.. నాన్నకి అస్తమాను ఫోనే.. మరి మాతో ఎప్పుడు..

అమ్మా.. నాన్నకి అస్తమాను ఫోనే.. మరి మాతో ఎప్పుడు..

మా అబ్బాయి ఎప్పుడూ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటాడు.. మా అమ్మాయి ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో ఛాటింగులు చేస్తుందని అమ్మానాన్న కంప్లైంట్ అయితే ఇస్తారు కానీ.. నిజానికి అమ్మానాన్న.. మాతో రోజుకి ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడతారా. నాన్నేమో ఆఫీస్ పనో లేదా బాస్‌తో పనో అంటూ ఫోన్ పట్టుకుని ఉంటారు. అమ్మేమో పక్కింటి ఆంటీతోనో లేక అక్క చెల్లెళ్లతోనో ఫోన్లో సంభాషణలు. మేం స్కూల్ నించి ఇంటికి వచ్చినా పట్టించుకోకుండా ఫోనే ఇంపార్టెంట్ అన్నట్లు మాట్లాడుతుంటారు. ఓ పక్క చెవిలో పెట్టుకునే మా పన్లు కానిస్తుంటారు. కాస్త ఫోన్ పక్కన పెట్టి మమ్మల్ని పట్టించుకోవచ్చుగా.. మేం చెప్పేది వినొచ్చుగా.. మాతో ఆడుకోవచ్చుగా.. ఇదేనండి మా డిమాండ్.. కాదు కాదు.. అభ్యర్థన.. అంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కేసారు జర్మనీకి చెందిన చిన్నారులు. పేరెంట్స్ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగాన్ని నిరసిస్తూ ఏడేళ్ల ఎమిల్ నిరసన ప్రదర్శన చేపట్టాడు. తన తోటి వారందరినీ, తనలాగే ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ కూడగట్టి ప్లకార్డులు చేతికిచ్చాడు. పిల్లలతో పాటు కొంతమంది పెద్దలు కూడా జతకలిశారు. అమ్మానాన్న మాతో ఆడండి.. ఫోన్లతో కాదు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జర్మనీలోని హంబర్గ్‌లో చేపట్టిన ఈ నిరసన ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎమిల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మరికొందరు నిజమే కదా అంటూ చిన్నారులపై సానుభూతి చూపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story