బంపర్ ఆఫర్.. ఇక్కడ నివసిస్తే నెలకు రూ. 40,000..

బంపర్ ఆఫర్.. ఇక్కడ నివసిస్తే నెలకు రూ. 40,000..

భలే ఛాన్సులే.. లలలా.. లలలా.. లక్కీ ఛాన్సులే.. నిజమే కదా మరి.. కట్నం ఇచ్చి మరీ అల్లుడిని ఇల్లరికానికి తెచ్చుకున్నట్లు.. మా ద్వీపానికి వస్తే రూ.40 వేలు ఇస్తామంటున్నారు అంటీకైథెరా ద్వీపానికి చెందిన మేయర్. గ్రీస్ దేశంలోని అంటీకైథెరా ద్వీపంలో నివసించే వారికి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ద్వీపం కనుమరుగైపోతుంది. ద్వీప అందాలను కాపాడుకోవాలంటే జనం సంచారం ఉండాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ కేవలం 24 మంది మాత్రమే నివసిస్తున్నారు. వేసవి కాలం వస్తే ద్వీపాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది కానీ మాములు రోజుల్లో అయితే మనుషులే కనిపించరు.

మధ్యధరా సముద్రంలోని క్రెటా, కైథిరా దీవుల మధ్య ఉన్న అంటీకైథెరా ద్వీపంలో ఆహారం తక్కువగా దొరుకుతుంది. శీతాకాలంలో ద్వీప అందాలు పర్యాటకులను మైమరపిస్తాయని ద్వీప మేయర్ ఆండ్రియాస్ చార్చలకిస్ గ్రీకు వెబ్‌సైట్‌కు చెప్పారు. ద్వీపంలో నివసించే వారి సంఖ్యను పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఈ ద్వీపంలో నివసించడానికి ఎవరైనా ఆసక్తి చూపితే ఇక్కడ ఉంటున్నందుకు వారికి నెలకు 450 పౌండ్లు (రూ.40 వేలు) చెల్లిస్తామంటోంది గ్రీస్ దేశం. ద్వీపాన్ని కాపాడుకోవాలని, దానికి పునర్‌వైభవాన్ని తీసుకు రావాలనే వారి ప్రయత్నం అభినందనీయం అంటూ పలువురు గ్రీస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story