మార్కులు కావాలంటే...గదికి రావాల్సిందే.. విద్యార్థినిలతో ఫ్రొఫెసర్‌ రాసలీలలు

మార్కులు కావాలంటే...గదికి రావాల్సిందే.. విద్యార్థినిలతో ఫ్రొఫెసర్‌ రాసలీలలు

విద్యా బుద్ధులు నేర్పి పిల్లలను మంచి మార్గంలో నడిపించే అధ్యాపకుడే గాడితప్పాడు. చదువుల నిలయంలోనే రాసలీలలతో కీచక పర్వం సాగించాడు. అమాయక విద్యార్థినిల జీవితాలతో చెలగాటమాడాడు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినిలపై ఓ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ సాగించిన లైంగిక దాడులు సంచలనం రేపుతున్నాయి. ఆలస్యంగా మేల్కొన్న వర్సిటీ అధికారులు కీచక అధ్యాపకుడిపై సస్పెండ్‌ వేటు వేశాడు. విషయం బయటకు పొక్కకుండా యూనివర్సిటీ అధికారులు జాగ్రత్త పడుతున్నారు.

ప్రఫొసర్‌ రవి కీచక పర్వం చూసి అధికారులే నివ్వెరపోతున్నారు. గత కొంత కాలంగా పాస్‌ మార్కులు వేయిస్తానని ఆశ చూపి బాలికలపై అత్యాచారం చేస్తున్నాడు రవి. పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులే టార్గెట్‌గా తన కీచక పర్వానికి తెరలేపాడు. అంతే కాదు తన లైంగిక కోరిక తీర్చిన విద్యార్థినిలకు పేపర్‌ లీక్‌ చేయడంతో పాటు ఇంట్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నాడు. ఇంట్లో వారిని పంపించి అక్కడే విద్యార్థునిలపై అత్యాచారం పాల్పడుతున్నాడు.ఒకటి కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో బాధిత విద్యార్థులు ఉన్నట్లు తేలడం కలకలం రేపుతోంది.

బాలికల హాస్టల్‌ భవనంలోనే సదరు ప్రొఫెసర్‌ రవి చాంబర్‌ కూడా ఉంది. ఇంకేముంది మరింత రెచ్చిపోయేవాడు. పాస్‌ మార్కులు వేయిస్తానని మాయ మాటలు చెప్పి.. తన చాంబర్‌కు విద్యార్ధినిలను పిలుపించుకుని బలత్కారం చేసేవాడు. ఇలా గత కొన్నాళ్లుగా రవి దారుణాలు కొనసాగాయి.తాజాగా ఓ విద్యార్ధినితో రవి చేసి ఫోన్‌ చాటింగ్‌తో కీచక అధ్యాపకుడి బండారం బట్టబయలైంది. ఇంటికి వస్తే పాస్‌ చేయిస్తానంటూ విద్యార్థినితో చాటు చేశాడు. సదరు విద్యార్ధిని అధికారులకు ఫిర్యాదు చేయడంతో... అప్పుడు అతనిపై చర్యలకు పూనుకున్నారు. ప్రస్తుతం దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేసి విచారణ చేస్తున్న అధికారులు.. ప్రొఫెసర్‌ రవిని సస్పెండ్ చేశారు.

బయటకు చెబితే ఎక్కడ కెరీర్‌ నాశనం అవుతుందోననే భయంతో...అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ రవి చేష్టలను మౌనంగా భరించారు విద్యార్ధినిలు. మరోవైపు ఇలాంటి ఘటనలపై గత కొన్నేళ్లుగా ఆరోపణలు వస్తున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story