కొడుకు చేతిలో నాన్న ఫోన్.. బాగోతం బట్టబయలు..

కొడుకు చేతిలో నాన్న ఫోన్.. బాగోతం బట్టబయలు..

చదువూ సంధ్యా లేదు.. ఎప్పుడు చూసినా ఫోను.. సినిమాలు.. షికార్లు.. కొంచెమైనా బుద్ది ఉండక్కర్లా.. అంటూ నీతి వాక్యాలు పిల్లలతో పలికే ముందు 'పెద్ద'లు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. మరి నాన్నంతటి వాడు కావాలంటే ఆయన బాటలోనే నడవాలి కదా.. గేమ్స్ ఆడుకుంటానంటే తండ్రి తన 15 ఏళ్ల కొడుక్కి తన మొబైల్ ఇచ్చాడు. ఏదో నొక్కితే మరేదో వచ్చింది. అమ్మోయ్.. నాన్న చూడవే ఎలాంటి పనులు చేస్తున్నాడో.. అంటూ తల్లి దగ్గరకు పరిగెట్టాడు పుత్ర రత్నం. బెంగళూరు బనశంకరీ స్టేజ్-3 ప్రాంతానికి చెందిన మహిళ ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ.. సాయింత్రాలు ఇంట్లోనే ట్యూషన్లు చెబుతోంది. భర్త నాగరాజు ఓ సామాజిక సంస్థ నాయకుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొడుకు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న సమయంలో తండ్రి రాసలీలలు బయటపడ్డాయి. అది తెలిసి భార్య అగ్గి మీద గుగ్గిలం అయింది. సామాజిక కార్యకర్తగా చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు.. చేసేది ఇలాంటి పాడు పనులా అంటూ నాగరాజుని నిలదీసింది. తన బాగోతం బయట పడడంతో పరువు పోతుందని భావించి.. బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భార్యని హెచ్చరించాడు. అయినా ధైర్యం చేసి పోలీసులకు విషయాన్ని వివరించింది ఆమె. పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story