'ఏపీ సహా 10 రాష్ట్రాలకు ప్రత్యేక సాయం పరిశీలనలో ఉంది'

ఏపీ సహా 10 రాష్ట్రాలకు ప్రత్యేక సాయం పరిశీలనలో ఉంది

గత ఏడాది ప్రత్యేక ప్యాకేజీ కింద 10 రాష్ట్రాలకు అత్యవసర నిధులు కేటాయించినట్టు ఆర్ధిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్లో రాతపూర్వక సమాధానంలో తెలిపారు. తెలంగాణకు విభజన హామీల్లో భాగంగా 450 కోట్లు వెనకబడిన జిల్లాలకు ఇవ్వడం జరిగిందన్నారు. ఏపీలో విదేశీ ఆర్ధికసాయం కింద చేపట్టిన పథకాలకు వడ్డీ రాయితీ కింద 15 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు కలిసి 5వేల239 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఆయా రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిధులు వెచ్చించామన్నారు.

గత ఏడాది త్రిపురకు అత్యధికంగా 1858 కోట్లు ఇచ్చిన కేంద్రం, యూపీలో అర్ధకుంభమేళాకు 12వందల కోట్లు మంజూరుచేసింది. ఇక బీహార్ కు 739 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్డు కోసం 309 కోట్లు మంజూరుచేసింది. ఏపీ, తెలంగాణ, కాశ్మీర్, త్రిపు, ఉత్తరాఖండ్, యూపీ, తమిళనాడు, నాగాలాండ్, గోవా, మధ్యప్రదేశ్ సహా మరో 10 రాష్ట్రాలు ప్రత్యేక సాయం కోసం విజ్ఞప్తి చేశాయన్నారు. ప్రస్తుతం ఆర్ధిక శాఖ పరిశీలనలో ఫైల్ ఉన్నట్టు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story