పన్నీర్ ఆర్డర్ ఇస్తే.. చికెన్ వచ్చింది.. జొమాటోకి రూ.55 వేలు ఫైన్

పన్నీర్ ఆర్డర్ ఇస్తే.. చికెన్ వచ్చింది.. జొమాటోకి రూ.55 వేలు ఫైన్

పాపం లాయర్ గారికి పన్నీర్ బటర్ మసాలా తినాలనిపించింది. జొమాటోకి ఆర్డర్ చేస్తే నిమిషాల్లో వేడి వేడిగా తీసుకొస్తాడు కదా.. హ్యాపీగా లాగించేయొచ్చనుకున్నారు. తీరా చూస్తే.. పూణేకు చెందిన లాయర్ షణ్ముఖ దేశముఖ్ జొమాటో యాప్ ద్వారా పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేశారు. పార్సిల్ రాగానే ఓపేన్ చేసి ముక్క నోట్లో వేసుకున్నారు. ఆయన వెజిటేరియన్. టేస్టేదో తేడాగా ఉండేసరికి అనుమానం వచ్చింది. తరచి చూస్తే అది చికెన్. తిన్నదంతా కక్కేసి జొమాటో మీద ఫైర్ అయ్యారు. అసలే లాయర్. నాతోనే పెట్టుకుంటారా అని వేంటనే కేసు ఫైల్ చేసారు. జొమాటోతో పాటు హోటల్‌పై వినియోగదారుల కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. శాఖాహారానికి బదులు మాంసాహారాన్ని పంపించినందుకుగాను జొమాటోకు రూ.55 వేల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది. ఇందులో తమ తప్పేమీ లేదు తప్పంతా హోటల్ వారిదే అని జొమాటో కోర్టులో మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. అదంతా మాకు అనవసరం సదరు వ్యక్తికి డబ్బు కట్టాల్సిందే అంటూ ఖరాఖండిగా చెప్పింది కోర్టు. తప్పు చేసింది హోటలే అయినా.. ఇందులో ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉందని తీర్పు చెప్పింది. రూ.50వేలు ఫైన్ కట్టడంతో పాటు.. మానసికంగా వేధించినందుకు మరో రూ.5వేలు లాయర్ గారికి ఇవ్వాల్సిందేనని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story