నా కొడుక్కి నేను అక్కర్లేదు.. నా ఆస్తి మాత్రం ఎందుకు..

నా కొడుక్కి నేను అక్కర్లేదు.. నా ఆస్తి మాత్రం ఎందుకు..

అమ్మానాన్న అక్కర్లేదు కానీ.. ఆస్తులు మాత్రం కావాలి. రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డల్ని పెంచితే రెక్కలు వచ్చిన తరువాత ఇంటి నుంచి తరిమేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కన్న బిడ్డలు చూడట్లేదని కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు కొందరైతే, కోర్టుల్ని ఆశ్రయించి న్యాయం చేయమని పోరాటం చేసేవారు మరికొందరు. ఒడిశాలోని దశరథపూర్‌కు చెందిన ఖేత్రమోహన్ మిశ్రా అనే రిటైర్డ్ ఉద్యోగి పాత్రికేయుడిగా పని చేశారు. ఆయన తనను వేధిస్తున్న కొడుక్కి తగిన శాస్తి చేశాడు. తన ఆస్తి మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వానికి రాసిచ్చాడు. ఆఖరికి తాను చస్తే తన అస్థికలను కూడా కొడుక్కి అందకుండా చూడాలని వీలునామా రాశాడు. 75 ఏళ్ల వయసులో నన్ను ఇన్ని కష్టాలు పెడుతున్న నా కొడుకు, కోడలికి నా కష్టార్జితాన్ని మాత్రం ఎందుకివ్వాలి. వారికి నేను అక్కర్లేనప్పుడు నా ఆస్తి మాత్రం ఎందుకు. అమ్మా నాన్నలకంటే ఆస్తే ఎక్కువైంది. అందుకే నన్ను చంపడానికి కూడా ప్రయత్నించాడు. ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చేశాను. నేను వృద్ధాశ్రమానికి వెళ్లిపోతున్నాను అని మిశ్రా చెబుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story