సెంచరీ సాధించిన అజింక్య రహేనే..

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 297 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. సెకండ్ ఇన్నింగ్స్ లో లంచ్ విరామానికి నాలుగు వికెట్ల కోల్పోయి 300 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో అజింక్య రహేనే సెంచరీ సాధించాడు.... Read more »

పిచ్చోడి చేతిలో రాయి.. ఏం చేస్తున్నాడో తెలియడంలేదు : అచ్చెన్నాయుడు

మంత్రి బొత్స మాటలకు విలువ లేదని.. ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. అమరావతిని మార్చాలన్న, ఉంచాలన్నా, చంపేయాలన్నా అంతా జగన్‌ చేతిలోనే ఉందన్నారు. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి జగన్‌ ఏం చేస్తున్నాడో తెలియడం లేదన్నారు. మేం అధికారంలో... Read more »

పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించడంపై రాష్ట్రపతి, ప్రధాని హర్షం

పీవీ సింధు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో ఆమె కుటుంబసభ్యులు, బంధుమిత్రుల్లో సంతోషం పొంగి పొర్లింది. సింధు కుటుంబసభ్యులు స్వీట్లు పంచుకొని, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రపంచ చాంపియన్‌ షిప్ టైటిల్ కోసం సింధూ 6 నెలలుగా సాధన చేస్తోందని ఆమె తల్లి విజయ తెలిపారు. క్వార్టర్... Read more »

వీరికి మంత్రి పదవులు ఖాయమా?

గ‌తేడాది డిసెంబ‌ర్ 13న కేసిఆర్‌తో పాటు మ‌హ‌మూద్ అలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు నెల‌ల త‌ర్వాత మ‌రో ప‌ది మందికి మంత్రి ప‌దవులు ద‌క్కాయి. ఇక మిగిలిన ఆరు మంత్రి పదవులను పెండింగ్‌లో పెట్టారు సీఎం కేసిఆర్. దీంతో సెప్టెంబ‌ర్ రెండో... Read more »

అమరావతి మార్పు తప్పదనే సంకేతాలు..

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా అమరావతి పైనే చర్చ. రాజధానిని పూర్తిగా తరలిస్తారా? లేక కుదిస్తారా? కేపిటల్‌ను దొనకొండలో ఏర్పాటు చేస్తారా ఇలా రకరకాల ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. అటు మంత్రులు తలోరకంగా చేస్తున్న ప్రకటనలు కూడా గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. మొత్తానికి అమరావతి... Read more »

తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారా?

తెలంగాణలో గెలుపే ల‌క్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీ..అంది వ‌చ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుంటోంది. ఏ చిన్న త‌ప్పు దొరికినా దుమ్ము దులిపేస్తోంది. పదునైన అరోప‌ణ‌ల‌తో ప్ర‌భుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. టీఆర్ఎస్‌ చేస్తున్న విమర్శలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు..... Read more »

చరిత్ర సృష్టించిన షట్లర్ పీవీ సింధు

హైదరాబాద్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచిన తొలి ఇండియన్‌గా నిలిచింది.. ఫైనల్లో జపాన్‌ ప్లేయర్ ఒకుహరపై రెండు వరుస సెట్లలో గెలిచింది..2017లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. 2017లో ఒకుహర చేతిలోనే ఓడిపోయి స్వర్ణాన్ని... Read more »

మట్టి గణపతే.. మహాగణపతి.. ఓరుగల్లువాసుల స్ఫూర్తి

పర్యావరణ పరిరక్షణకు ఓరుగల్లువాసులు నడుంబింగిచారు. ఇందులో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టాద్దామని ప్రతినబూనారు. గణేష్‌ మండళ్ల నిర్వాహకులు సైతం ముందుకురావడంతో పొరుగు రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకొచ్చి మట్టి గణపయ్యలను తయారు చేస్తున్నారు. POP విగ్రహాలకు ధీటుగా గడ్డి, కలపతో మట్టినిఉపయోగించి ఓరుగల్లులో బొజ్జ... Read more »

వీజీ సిద్ధార్థ కుటుంబంలో మరో విషాదం..

కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. వీజీ సిద్ధార్థ తండ్రి గంగయ్య హెగ్దే(96) మృతిచెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కోమాలో ఉన్న ఆయన మైసూరులోని ఓ... Read more »

విజృంభిస్తున్న విష సర్పాలు.. ఈ జాగ్రత్తలు పాటించాలి..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విష సర్పాలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పాము కాటు బాధితులు, మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో పాము కాటుతో భార్య, భర్తతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పాము కాట్లతో వరుసగా... Read more »

ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, నాయిని నర్సింహారెడ్డి అల్లుడు మధ్య కోల్డ్‌వార్‌..

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, నాయిని నర్సింహారెడ్డి అల్లుడు, రాంనగర్‌ కార్పోరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి మధ్య ఇన్ని రోజులు సాగిన కోల్డ్‌వార్‌.. రాం నగర్‌ డివిజన్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో బహిర్గతమైంది. తన వర్గీయుడికే అధ్యక్ష పదవి... Read more »

పెద్దపులి మృత్యువాత కలకలం

కొమురం భీం జిల్లా సమీపంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో మరో పెద్దపులి మృత్యువాత పడడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా పోడ్సా గ్రామంలో పంట చేనులో పెద్ద పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వెంటనే అక్కడికి చేరుకున్న మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు... Read more »

ఆర్టికల్ 370 రద్దు అప్రజాస్వామికం : సీపీఐ

ఆర్టికల్ 370 రద్దు అప్రజాస్వామికమన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామ్య విధానాలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ముగ్దుం భవన్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, కశ్మీర్ పరిణామాలపై ఆయన ప్రసంగించారు. కమ్యూనిస్టులు ఏకమై ప్రజా వ్యతిరేక విధానాలపై... Read more »

ప్రకాశం బ్యారేజీలోంచి ఎట్టకేలకు బయటపడ్డ బోటు

వరద ఉధృతికి కొట్టుకువచ్చి విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ 68వ గేట్‌కు అడ్డంగా ఇరుక్కుపోయిన పడవను ఎట్టకేలకు NDRF సిబ్బంది బయటకు తీశారు. వారం రోజుల క్రితం ఇబ్రహీం పట్నం నుంచి రెండు ఇసుక పడవలు కొట్టుకువచ్చాయి. వాటిలో ఒకటి గేటు వద్ద చిక్కుకుపోవడంతో, గేటు... Read more »

‘ఇకపై రాష్ట్రానికి నాలుగు రాజధానులు’

ఏపీ రాజధానిపై ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాష్ట్రానికి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయని చెప్పారు. రాజధాని అంశంపై జగన్ బీజేపీతో చర్చించారని, పార్టీ హైకమాండ్ తమకు ఈ విషయం చెప్పిందని అన్నారు. త్వరలోనే విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాలు... Read more »

అమరావతిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స

అమరావతిపై మరోసారి మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. రాజధాని ఏ ఒక్కరిదో, ఏ ఒక్క సామాజిక వర్గానిదో కాదని.. రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదికను... Read more »