ఆల్‌టైం రికార్డుకు చేరిన బంగారం ధర

ఆల్‌టైం రికార్డుకు చేరిన బంగారం ధర

బంగారం ధర మళ్లీ ఆకాశన్నంటింది. ఆల్‌టైం రికార్డు ధర రూ.40వేల మార్క్‌పైకి చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా.. 670 రూపాయల పెరుగుదలతో 40వేల 150కు ఎగసింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడిందంటున్నారు మార్కెట్ నిపుణులు.

అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పది గ్రాముల పసిడి ఇప్పటికే 40 వేలు రూపాయలు దాటింది. అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌, ఆర్థిక మందగమనం కారణంగానే అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ వాణిజ్య యుద్ధాలు, ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితి కొనసాగితే బంగారం ధరలు కొద్ది నెలల్లోనే 41 వేల రూపాయలు దాటే అవకాశముందంటున్నారు నిపుణులు. పసిడి ధర భారీగా పెరగడంతో అమ్మకాలు తగ్గిపోయాయని, పాత రీసైక్లింగ్‌ పెరిగిందంటున్నారు జ్వూవెలర్స్‌ వ్యాపారులు. ఇక దీపావళి నాటికి పదిగ్రాముల బంగారం మరింత పెరగొచ్చునని అంచనా వేస్తున్నారు.

ఓ వైపు.. బంగారం ధర పరుగులు పెడితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పైకి కదిలింది. కిలో వెండి ధర 45 రూపాయల పెరుగుదలతో 47వేల 845 రూపాయలకు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణమంటున్నారు మార్కెట్‌ నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story