నిన్న ఈటల.. ఇప్పుడు రసమయి.. కరీంనగర్‌లో బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

నిన్న ఈటల.. ఇప్పుడు రసమయి.. కరీంనగర్‌లో బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటెలకు,,నాకు నిజాలు మాట్లాడటమేవచ్చు...కడుపులో ఏమీ దాచుకోమంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యమంలో కొట్లాడినోళ్లమని..మాకు అబద్దాలు రావంటూ చెప్పుకొచ్చారు రసమయి. ఇదే సమయంలో వేదికపై ఉన్న మంత్రి ఈటెల..నవ్వుతూ ‘జాగ్రత్తగా మాట్లాడు’ అంటూ సూచించారు. దానికి రసమయి ఏమీ కాదన్నా అంటూ తన సహజశైలిలో ప్రసంగం కొనసాగించారు.. మంత్రి పదవి బిక్షం కాదు..మేం గులాబీ బాసులం అంటూ ఇటీవలే ఈటెల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఇప్పుడు రసమయి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన టీచర్స్ డే వేడుకలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది.

Watch Fast News :

రసమయి బాలకిషన్‌లా తాను మాట్లాడలేను..ఈ వేదిక మీద మాట్లాడే స్వేచ్ఛ అతనికి ఉందన్నారు మంత్రి ఈటెల. అలాగే నేటి రాజకీయాలపై ఈటెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రాజకీయ నేతలకు మెరిట్‌ లేదని మంత్రి చెప్పుకొచ్చారు. రాజ్యాంగం రాసుకున్నట్టు మనం ఉన్నామా.. అంబేద్కరిజం పై చర్చ జరగాలన్నారు. విద్యార్దులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని ఈటెల పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story