ఇంకెన్నిసార్లు ఇవ్వాలి మా భూములు.. మమ్మల్ని బతకనివ్వరా?

ఇంకెన్నిసార్లు ఇవ్వాలి మా భూములు.. మమ్మల్ని బతకనివ్వరా?

నాగర్‌ కర్నూల్ జిల్లా కుడికిల్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సర్వే పనులను రైతులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సర్వే కోసం పోలీస్‌ బలగాలతో అధికారులు వచ్చి గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. కుడికిల్ల గ్రామ సమీపంలో సర్వేకు వచ్చిన అధికారులను రైతులు నిలదీశారు. గతంలో మిషన్‌ భగీరథతో పాటు పలు ప్రాజెక్టులకు భూములు ఇచ్చామని.. మళ్లీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇవ్వలేమని తేల్చి చెప్పారు.రైతుల విన్నపాన్ని పట్టించుకోకుండా అధికారులు సర్వేకు దిగడంతో వారు నిరసనకు దిగారు. ఓ రైతు బండరాయితో తలపై కొట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరో రైతు పెట్రోల్‌ బాటిల్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి దిగాడు. పరిస్థితి అదుపు తప్పడంతో రైతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పాలమూరు-రంగారెడ్డి సర్వే కోసమే ముందు జాగ్రత్తగా రైతులను అదుపులోకి తీసుకున్నామని నాగర్‌ కర్నూల్ జిల్లా ఎస్పీ సాయి కిరణ్ తెలిపారు‌.

Tags

Read MoreRead Less
Next Story