సిద్ధిపేట మోడల్‌ అని చెప్పుకునే కేసీఆర్‌.. ఈ ఘటనను చూసైనా తెలుసుకో: భట్టి

సిద్ధిపేట మోడల్‌ అని చెప్పుకునే కేసీఆర్‌.. ఈ ఘటనను చూసైనా తెలుసుకో: భట్టి

తెలంగాణలో యూరియా కొరత పొలిటికల్ దుమారానికి కారణం అవుతోంది. ఎరువుల కొరత పాపం మీదంటే.. మీదంటూ టీఆర్ఎస్, బీజేపీలు ఆరోపించుకుంటున్నాయి. యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అంటోంది రాష్ట్ర బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయంపై ముందస్తు ప్రణాళిక లేదని విమర్శించింది. అయితే..టీఆర్ఎస్ మాత్రం బీజేపీ ఆరోపణలను కొట్టి పారేస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన యూరియా తెప్పించాలన్న కనీస సోయి బీజేపీ వాళ్లకు లేదని ఎదురుదాడికి దిగుతోంది. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రమే కారణమంటూ ఆరోపిస్తోంది.

కాంగ్రెస్ కూడా యూరియా విషయంపై విమర్శలు చెస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌లో యూరియా కోసం లైన్‌లో నిలబడి రైతు చనిపోయిన ఘటన తనను కలచివేసిందన్నారు భట్టి విక్రమార్క. సిద్ధిపేట మోడల్‌ అని చెప్పుకునే కేసీఆర్‌ ఈ ఘటనను చూసి సిగ్గుపడాలన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన ఎరువుల్లో కొంత భాగం తాత్కాలికంగా కర్ణాటకకు తరలించారని.. దీని వల్లే కొరత ఏర్పడిందని వివరించారు.... దుబ్బాకలో యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు ఎల్లయ్య చనిపోవడం దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. కావాలనే కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story