రిలేషన్‌షిప్‌లో ఉన్నాను.. పిల్లలు కావాలనుకున్నపుడే పెళ్లి చేసుకుంటా..

ప్రముఖ నటి తాప్సీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంట .. ఈ విషయాన్ని తనే స్వయంగా ఒప్పుకున్నారు. తాప్సీ తాజాగా పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. సోదరి షగున్‌తో కలిసి తాప్సీ ఆ వెబ్‌సైట్‌ ముఖాముఖిలో పాల్గోన్నారు. ” నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. నేనంటే ఇష్టం ఉండేవారు నాపై వచ్చే గాసిప్స్‌‌ను చూడడమే కాకుండా అవి నిజమో కాదో తెలుసుకుంటారు. నాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తి అందరూ ఆసక్తి చూపించే రంగానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన అసలు సెలబ్రిటీ కూడా కాద”ని తాప్సీ తెలిపారు

“నాకు ఎప్పుడు పిల్లలు కావాలనిపిస్తుందో అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ద్వారానే పిల్లలను పొందాలని అనుకోవడం లేదు. నా వివాహ వేడుక చాలా సింపుల్‌గానే ఉంటుందంటూ” తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన  పలు విషయాలను ఆ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు అలాగే.. తన రాకుమారుడిని కలిసేముందు ఎన్నో కప్పలను ముద్దాడానని అంటూ తాప్సీ చమత్కరించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.