ఆర్మీ డాగ్ డచ్ మృతి..

ఆర్మీ డాగ్ డచ్ మృతి..

సైన్యానికి, శునకాలతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఎక్కువ. భద్రతలో డాగ్స్ పాత్ర చాలా కీలకం. శత్రువుల ఆచూకీ కనిపెట్టడం, ల్యాండ్‌మైన్స్‌ను గుర్తించడం, మారణాయుధాల గుట్టు రట్టు చేయడంలో శునకాలు వాటికవే సాటి. అందుకే డాగ్స్‌కు ఆర్మీ చాలా విలువ ఇస్తుంది. ఆ విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. భారత సైన్యంలో చాలాకాలం సేవలందించిన డచ్ అనే డాగ్ ఇటీవల చనిపోయింది. డచ్ మృతిపై ఆర్మీ తీవ్రంగా స్పందించింది. దేశానికి సేవ చేసిన రియల్ హీరో అని అభివర్ణించింది. ఇక, రక్షణమంత్రి రాజ్‌నాధ్‌సింగ్ కూడా డచ్ మృతిపై సంతాపం తెలిపారు. దేశ సేవలో అసామాన్య సేవలు అందించిందని కొనియాడారు.

డచ్, ఆర్మీకి ఎన్నో విధాలుగా ఉపయోగపడింది. ఉగ్రవాద పీడిత ప్రాంతాల్లో ఐఈడీలను కనిపెట్టి జవాన్లకు ముప్పు తప్పించింది. ల్యాండ్ మైన్లను కనిపెట్టడంతో పాటు ఎన్నో ఆపరేషన్లలో తనవంతు సేవలందించింది. ఫుల్‌ ఫ్లెడ్జ్‌గా పని చేసిన డచ్ బుధవారం మృతి చెందింది. డచ్ మృతిపై ఆర్మీ ఘనంగా నివాళులు అర్పించింది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story