కేంద్ర మంత్రి జుట్టు పట్టుకొని తోసేసిన..

కేంద్ర మంత్రి జుట్టు పట్టుకొని తోసేసిన..

బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రమంత్రి, బీజేపీ నేత బాబుల్‌ సుప్రియోపై వామపక్ష విద్యార్థి సంఘం కార్యకర్తలు దాడి చేశారు. వందలాదిమంది వామపక్ష కార్యకర్తలు, బాబుల్ సుప్రియోను చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి జుట్టు పట్టుకొని తోసేశారు. సెక్యూరిటీ సిబ్బంది తుపాకులు కూడా కిందపడిపోయాయి.

జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్‌కు బాబుల్ సుప్రియోను ఆహ్వానించడంతో ఆయన వెళ్లారు. ఐతే, అనూహ్యంగా SFI, AISF కార్యకర్తలు బాబుల్ సుప్రియోను అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దాంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ సురంజన్ దాస్ జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి పటిష్ట బందోబస్తు మధ్య ఆడిటోరియంలోకి మంత్రి చేరుకున్నారు. ఐతే, తిరిగి వెళ్లేటప్పుడు కూడా వామపక్ష విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంత్రిని మరోసారి చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. వరుస ఘటనలతో యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది.

వామపక్ష విద్యార్థుల దాడిపై బాబుల్ సుప్రియో మండిపడ్డారు. రాజకీయాలు మాట్లాడడానికి తాను రాలేదని, ‌అది అర్ధం చేసుకోకుండా రణరంగం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story