బతుకమ్మ చీరెల పంపిణీ ఎప్పుడంటే..

బతుకమ్మ చీరెల పంపిణీ ఎప్పుడంటే..

వరుసగా మూడో ఏడాది బతుకమ్మ చీరల పంపిణీకి అంతా సిద్ధమైంది. తొలిసారి చీరల పంపిణీ సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రెండో దఫా కంటే ఈ సారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. తెల్లరేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ బతుకమ్మ చీరలను అందించనున్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి రెండు లక్షల మంది అర్హులు ఉన్నారని నిర్ధారించుకున్న ప్రభుత్వం.. బతుకమ్మ చీరల కోసం 313 కోట్ల రూపాయల్ని కేటాయించింది.

ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రతి నియోజక వర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులు పింపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ ఏడాది 10రకాల డిజైన్‌లు, 10 రకాల రంగుల్లో మొత్తం 100 వెరైటీల్లో చీరలను సిద్ధం చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు చీరలను పంపించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌ సీడీఎంఏ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను ప్రదర్శించారు.

బతుకునిచ్చే బతుకమ్మ పండగ అన్నట్లు బతుకమ్మ చీరల పంపిణీ నేతన్నల ఇంట్లో వెలుగులు నింపుతోంది. మొత్తం 16 వేల కుటుంబాలకు ఆసరా ఇస్తోంది. చేనేత కార్మికులకు గతంలో నెలకు 8 నుంచి 12వేలలోపే ఆదాయం వచ్చేదని.. కానీ, బతుకమ్మ చీరల తయారీ ప్రారంభించాక 16 వేల నుంచి 20వేల రూపాయల వరకు ఆదాయం వస్తోందని కేటీఆర్ అన్నారు.

Also watch:

Tags

Read MoreRead Less
Next Story