కొత్త మోటారు వాహనాల చట్టానికి వ్యతిరేకంగా ట్రాన్స్‌పోర్టు సమ్మె

కొత్త మోటారు వాహనాల చట్టానికి వ్యతిరేకంగా ట్రాన్స్‌పోర్టు సమ్మె

దేశ రాజధాని స్తంభించింది. రవాణ వ్యవస్థ నిలిచిపోవడంతో సాధారణ జన జీవితం అతాలకుతలమైంది. ఆటోలు, క్యాబ్‌లు, కమర్షియల్ బస్సులు రాక పోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆఫీసులకు వెళ్లేవాళ్లు సమయానికి బస్సులు, ఆటోలు దొరక్క సతమతమయ్యారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. అధిక జరిమానాలను రద్దు చేయాలని ట్రాన్స్‌పోర్టు యూనియన్లు డిమాండ్ చేశాయి. నిబంధనలను కొద్దిగా సడలించాని నినాదాలు చేశారు.

మోటారు వాహనాల కొత్త చట్టం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఈ నిబంధనలపై సామాన్య ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ట్రాన్స్‌పోర్టు సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. దాంతో కొత్త వాహనచట్టానికి వ్యతిరేకంగా ట్రాన్స్‌పోర్టు సంఘాలు ఢిల్లీలో ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెలో భాగంగా యూనియ‌న్లు బంద్ పాటించాయి. యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేష‌న్స్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మెలో ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్ ఆప‌రేట‌ర్లు, క‌మ‌ర్షియ‌ల్ బ‌స్సుల నిర్వాహకులు పాల్గొన్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story