గోదావరిలో బోటు ప్రమాదం ఇలా జరిగింది!

గోదావరిలో బోటు ప్రమాదం ఇలా జరిగింది!

అసలు కచ్చులూరు బోటు ప్రమాదం ఎలా జరిగింది? విడతలవారిగా మూడుసార్లు బోటు ఎందుకు బోల్తా పడింది? ఈ ప్రమాదంలో ఎక్కువ మంది గల్లంతు కావడమానికి కారణం మేంటి? దీనిపై ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు? ఈ ప్రమాదంలో బోటు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు సమాధానాలు లేని ప్రశ్నలు మిగిలిపోతున్నాయి.

సరిగ్గా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భోజనం కోసం బోటును ఆపాలనుకున్నారు. అయితే... గట్టు వద్ద ఆపకుండా.... నడి గోదారిలో ఆపినట్లు చెబుతున్నారు ప్రాణాలతో బయటపడిన పర్యాటకులు. ఆకలితో ఉన్న పర్యాటకులంతా .. భోజనం కోసం బోటుకు ఒకే వైపు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో... బోటు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో బోటు మునిగిపోతోందని ఆందోళన చెందిన పర్యాటకులు....అనేక మంది నీటిలో దూకేశారు. అయితే... బోటు మాత్రం మునిగిపోలేదు. దీంతో....వారంతా .. ఒకవైపు ఒరిగిపోయిన బోటుపై ఎక్కి ప్రాణాలు రక్షించునేందుకు యత్నించారు.

అయితే అదే సమయంలో... బోటు మరోసారి తిరగబడింది. దీంతో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి బోటు పైకెక్కిన వాళ్లంతా హాహాకారాలు చేశారు. వీరి కేకలు విన్న సమీప గ్రామస్థులు రెండు బోట్లుతో ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు 10మందికిపైగా రక్షించారు. వీరిని గట్టు వద్ద చేర్చి తిరిగి వస్తుండగా... అప్పటికే రెండుసార్లు బోల్తా పడిన బోటు మరోసారి తిరగబడింది. మూడోసారి బోల్తపడటంతో... అందులో ఉండేవారంతా నీటిలో మునిగిపోయారు. ఎవ్వరూ కనిపించలేదు. కేవలం లైఫ్‌జాకెట్‌ వేసుకున్న మరికొంతమందిని రక్షించగలిగారు స్థానికులు. మొత్తంగా ఈ బోటులో 73 మంది ఉండగా... ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 24 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. 12 మంది చనియారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story