గోదావరిలో పడవ మునక.. అందులో 60 మంది..

గోదావరిలో పడవ మునక.. అందులో 60 మంది..

తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక బోటు పున్నమి లాంచ్‌ మునిగిపోయింది. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో 17 మందిని రక్షించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నారు. ప్రమాద సమయంలో... బోటులో 60 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి... తక్షణ సహాయం చేయాలంటూ అధికారుల్ని ఆదేశించారు.

గోదావరికి వరద ఉద్ధృతి తగ్గడంతో పర్యాటకుల్ని అనుమతించారు. దీంతో.. ఈ ఉదయం గండిపోచమ్మ ఆలయం నుంచి పున్నమి లాంచ్‌ ... 60 మంది పర్యాటకులతో బయలుదేరింది. అయితే సరిగ్గా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద వచ్చే సరికి.... హఠాత్తుగా.. ఈ పర్యాటక బోటు మునిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సీఎం ఆదేశాలతో.... పర్యాటక శాఖ మంత్రి అవంతీ శ్రీనివాస్‌ ఘటనాస్థలికి బయల్దేరి వెళ్లారు. అటు.. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలసుకుంటున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.

అటు... సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం 17 మందిని రక్షించగా... మరో 40 మంది కోసం గాలిస్తున్నారు. గత ఏడాది మే నెలలోనూ ఇదే ప్రాంతంలో... బోటు మునిగి 16 మంది చనిపోయారు. ఇప్పుడూ అదే ప్రాంతంలో మరోసారి ఇలాంటి దుర్ఘటన జరగడంతో.... ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story