ఏపీ సర్కార్‌పై కేంద్రం సీరియస్

ఏపీ సర్కార్‌పై కేంద్రం సీరియస్

ఏపీ ప్రభుత్వంపై మరోసారి సీరియస్‌ అయింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో గందరగోళానికి తెరదించాలని కోరుతోంది. ఏపీ సర్కార్ నియమించిన నిపుణుల కమిటీ నివేదికకు, ప్రాజెక్టు అథారిటీ చెప్తున్న లెక్కలకు మధ్య తేడా రావడంపై ప్రధానమంత్రి కార్యాలయం గతంలో లేఖ రాసింది. దానిపై జగన్ సర్కార్‌ వివరణ ఇవ్వకపోవడంతో.. మూడు రోజుల్లో జవాబు చెప్పాలని తాజాగా PMO కోరింది.

పోలవరం పరిణామాలపై నివేదిక ఇవ్వాలంటూ ఆగస్టు 26న ప్రధానమంత్రి కార్యాలయం ఏపి ప్రభుత్వానికి లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నివేదిక ఆధారంగా ఈ లేఖ రాసింది పీఎంవో.. ఆ తర్వాత పరిణామాలు, రివర్స్‌ టెండరింగ్‌పై ప్రాజెక్టు ఆథారిటీ విముఖత ప్రదర్శించినా ముందుకెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో చెప్పాలని లేఖలో పేర్కొంది..దీనిపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.

మరోవైపు పోలవరం రీ టెండర్ల విషయంలో రాష్ట్ర ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. సాగునీటి ప్రాజెక్టులో మిగిలిన కాంక్రీటు పనులు, జల విద్యుత్కేంద్రం పనులను కలిపి ఒకే ప్యాకేజీగా గత నెల 17న రివర్స్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. టెండర్లను ఈనెల 6న అప్లోడ్‌ చేశారు. ప్రీబిడ్‌ క్వాలిఫికేషన్‌ సమావేశంలో లేవనెత్తిన సందేహాలపై ఈ నెల 12న పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌బాబు సమాధానాలివ్వనున్నారు. ఇక కేంద్రానికి రేపు సమాధానం చెప్పనున్నట్లు తెలుస్తోంది.. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చెప్పబోయే సమాధానం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story