టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంపై తేల్చుకోలేకపోతున్న ఆ పార్టీ..

మగ్ధూంబవన్‌కు వెళ్లి హుజూర్ నగర్‌ ఉప ఎన్నికలో తమకు మద్దతివ్వాలని టిఆర్‌ఎస్‌ కోరినవెంటనే.. అందుకే ఒకే చెప్పింది సీపీఐ పార్టీ. ఆ తరువాత తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరినప్పటికీ.. కారుకే జైకొట్టింది కంకికొడవలి పార్టీ. టిఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ప్రకటించిన కొద్ది రోజులకే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై తేల్చుకోలేక పోతోంది సీపీఐ. హూజూర్ నగర్‌లో అధికారపార్టీకి మద్దతిస్తూ.. కార్మికులకు ఎలా న్యాయం చేస్తారని.. ఇతర విపక్షాలు ప్రశ్నించే సరికి.. సంధిగ్దంలో పడింది కంకి కొడవలి పార్టీ..

సోమాజీగూడలో అఖిలపక్ష సమావేశంలో కార్మికుల డిమాండ్లు సహేతుకమైనవేనని.. ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేశారు చాడా.. లేకుంటే హుజూర్ నగర్‌లో మద్దతుపై పునరాలోచిస్తామన్నారు. అటు రాష్ట్రపార్టీ నేత కూనంనేని సాంబశివరావు సైతం మద్దతు పై పార్టీలో చర్చిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వామపక్షాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది.. 2014 లో సీపీఐ నుంచి ఒకరు సీపీఎం నుంచి ఒకరు గెలిచారు.. సీపీఐ నుంచి గెలిచిన రవీంద్రకుమార్ టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో అసెంబ్లీలో వాయిస్ లేకుండా పోయింది. 2018 ఎన్నికల్లో మహాకూటమి తరపున పోటిచేసిన ఎక్కడ గెలవలేకపోయారు. స్వయంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పోటి చేసిన హుస్నాబాద్‌లో సైతం ఘోరంగా ఓటమి చవిచూశారు..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసినా... ఎన్నికలు వచ్చే సరికి అధికారపార్టీ.. లేకుంటే ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపి రెండుమూడు సీట్లు గెలిచేందుకు నిర్ణయాలు తీసుకునేవారు. ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీతో కలిసి పోటి చేసిన వామపక్షాలు చెప్పుకో దగ్గ స్థాయిలో సీట్లు గెలుపొందాయి.. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ తోనూ జతకట్టి ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంది. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీతో జతకట్టి 2009 మహాకటూమిగా పోటి చేసి ఓటమిపాలయ్యారు సీపీఐ నేతలు. 2014 లో ఒక ఎమ్మెల్యేకే పరిమితమయింది.. గెలిచిన రవీంద్రనాయక్ సైతం టీఆర్ఎస్‌లో చేరారు.. 2018 లోనూ కాంగ్రెస్ , టీజేఏఎస్ ,టీటీడీపీ మరోసారి మహాకూటమిగా జట్టు కట్టినప్పటికి ఒక సీటు గెలుపొందలేకపోయారు. పార్టీ ఉనికి ప్రశ్నార్దకంగా మారిన నేపద్యంలో.. అధికారపార్టీతో కలిసి ముందుకు సాగితే .. రాజకీయపరంగా ముందుకు సాగవచ్చని.. వచ్చే మున్సిపలో ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలుపొందవచ్చని నిర్ణయానికి వచ్చి.. హూజూర్ నగర్‌లో టిఆర్‌ఎస్‌కు జై కొట్టారు సీపీఐ నేతలు.. తీరా ఇఫ్పుడు ఆర్టీసీ సమ్మెతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు సీపీఐ నేతలు.

Tags

Read MoreRead Less
Next Story