ఆర్డీఎక్స్ లవ్‌ మూవీ రివ్యూ

ఆర్డీఎక్స్ లవ్‌ మూవీ రివ్యూ

కొన్ని సినిమాల ప్రమోషనల్ యాక్టివిటీస్ చూసినప్పుడే ఆ సినిమాలు ఎలా ఉండబోతున్నాయో ఓ అంచనాకు వస్తాం. ఈ మధ్య కాలంలో అలాంటి అభిప్రాయాన్నే క్రియేట్ చేసిన సినిమా ఆర్డీఎక్స్ లవ్. కానీ ప్రమోషన్స్ లో కనిపించినదానికి సినిమాకూ చాలా వేరియేషన్ ఉందని చూస్తే కానీ తెలియదు. ఓ మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలైంది. మరి ఆ కాన్సెప్ట్ ఏంటీ..? అసలు సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం..

అలివేలు అనే అమ్మాయి తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి సోసల్ సర్వీస్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఎయిడ్స్ అవేర్ నెస్, స్వచ్ఛ్ భారత్ వంటి అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. ఉంటారు. ఈ క్రమంలో వారి ఎయిడ్స్ అవేర్ నెస్ సర్వీస్ నచ్చిన సిద్ధూ అలివేలుతో ప్రేమలో పడతాడు. ఈ టైమ్ లో ఓ న్యూస్ ఛానల్ యజమాని అలివేలుపై హత్యా ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపు ఈ ఐదుగురి టార్గెట్ సీఎంను కలవడం.. మరి వాళ్లు సీఎంను ఎందుకు కలవాలనుకుంటారు..? ఆ ఛానల్ అతను వీళ్లను ఎందుకు చంపాలనుకుంటాడు..? అసలు వారి లక్ష్యం ఏంటీ అనేది మిగతా కథ.

ఆర్ఎక్స్ 100 తో ఓవర్ నైట్ క్రేజీ హీరోయిన్ గా మారిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఒక్క సినిమాతో పది సినిమాల ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామ చేసిన రెండో సినిమానే ఆర్డీఎక్స్ లవ్. తన ఫస్ట్ మూవీతో వచ్చిన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా సాగిన సినిమా ఆర్డీఎక్స్ లవ్. పాయల్ రాజ్ పుత్ కు రెండో సినిమాతో ఆకట్టుకుంది. మరీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అని కాదు కానీ.. తను బాగా చేసింది. అలాగే హీరో తేజస్ కూడా ఆకట్టుకున్నాడు. టీజర్, ప్రమోషన్స్ లో కనిపించిన పాట తప్ప మిగతా అంతా దాదాపు ఇది క్లీన్ మూవీనే. ఓ సామాజిక సందేశం ఇవ్వాలనుకున్న దర్శకుడు అందుకు తగ్గట్టుగా రాసుకున్న సీన్స్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది అనిపిస్తుంది. అదే టైమ్ లో హీరోయిన్ అండ్ టీమ్ చేసే ప్రయత్నం వెనక చూపించిన ఫ్లాష్ బ్యాక్ చాలా బావుంది.. కబడ్డీ సీన్, హీరోయిన్ చనిపోవడానికి ముందు సీన్ తో పాటు వీరి ప్రేమ వ్యవహారంతో ఛానల్ యజమానిని ఆడుకునే సీన్స్ అన్నీ ఆకట్టుకుంటాయి.

నేపథ్య సంగీతం, పాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ మెయిన్ ఎస్సెట్. మాటలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. మహిళ అంటే అబల కాదు అని నిరూపించే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. దర్శకత్వ పరంగా ఓకే అనిపించుకున్నా.. ఇంకాస్త బెటర్ సీన్స్ అయితే ఉండాల్సింది అనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ సర్వీస్ కు సంబంధించిన సన్నివేశాలు. ఇక అవుట్ డోర్ లో చిత్రీకరించిన పార్ట్ అంతా నేచులర్ గా ఉంది. రొమాంటిక్ సాంగ్ పిక్చరైజేషన్ బ్యూటీఫుల్ గా ఉంది. మొత్తంగా పైకి కనిపించేలా కాకుండా కాస్త ఆలోచింప చేసే స్టఫ్ సినిమాగా ఆర్డీఎక్స్ ను చెప్పొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story