దక్షిణాఫ్రికా చరిత్రలో ఫాలోఆన్‌ ఆడి చిత్తుగా ఓడింది

దక్షిణాఫ్రికా చరిత్రలో ఫాలోఆన్‌ ఆడి చిత్తుగా ఓడింది

పుణేలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. 137 పరుగుల భారీ స్కోర్ తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌ ఆడుతున్న సఫారీలు 189 పరుగులకే కుప్పకూలారు. దీంతో దక్షిణాఫ్రికా చరిత్రలో ఫాలో ఆన్ ఆడిన ఆ జట్టు చిత్తుగా ఓడింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా టాపార్డర్‌ కకావికలమైంది. సఫారీల రెండో ఇన్నింగ్స్‌లో మార్కరమ్‌ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరితే, డీన్‌ ఎల్గర్‌(48) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బావుమా(38) ఫర్వాలేదనిపించాడు. మార్కరమ్‌ను ఇషాంత్‌ ఎల్బీగా ఔట్‌ చేస్తే, డిబ్రుయిన్‌(8)ను ఉమేశ్‌ యాదవ్‌ బోల్తా కొట్టించాడు. సాహా అద్భుతమైన క్యాచ్‌తో డిబ్రుయిన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

దాంతో 21 పరుగులకే సఫారీలు రెండు వికెట్లు కోల్పోగా, డుప్లెసిస్‌(5) అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఇక్కడ కూడా సాహా మరో చక్కటి క్యాచ్‌ పట్టడంతో డుప్లెసిస్‌ భారంగా పెవిలియన్‌ వీడాడు. ఆపై ఎల్గర్‌, డీకాక్‌(5),బావుమా, ముత్తుసామీ(9)లు పెవిలియన్‌ చేరారు. ఆ తరువాత ఫిలాండర్(37), కేశవ్ మహారాజ్(22) ఆదుకునే ప్రయత్నం చేసినా వారు కూడా నిలబడలేదు, రబడా(4) అవుట్ కావడంతో 189 పరుగులకే అల అవుట్ అయింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్(3) ,జడేజా(3), అశ్విన్‌(2) వికెట్లు సాధించగా, ఇషాంత్‌, ఉమేశ్‌ యాదవ్‌, షమీలకు వికెట్‌ చొప్పున లభించింది. కాగా.. ఈ టెస్టులో విజయంతో భారత్‌ సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story