పిన్నిపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడు

పిన్నిపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడు

సభ్య సమాజం తలదించుకునే నీఛమైన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ దుర్మార్గుడు తల్లి వరసయ్యే పిన్నిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈ ఘటన కూనవరం మండలం భీమవరం గ్రామంలో జరిగింది.

ఓ మహిళపై తన సొంత బావ కొడుకైన శివ చైతన్య అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన శివ తన పిన్నిపై దారుణానికి ప్రయత్నించాడు. ఆ కీచకుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివకోసం గాలిస్తున్నారు.

ఆ కామాంధుడు గతంలోనూ ఇలాగే ఓ యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా వార్నింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు. కానీ కుక్కతోక వంకర అన్నట్టుగా ఈ సారి తన సొంత పిన్నిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

Tags

Read MoreRead Less
Next Story