9674 గ్రామ వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్..

9674 గ్రామ వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్..

ap-jobs

నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గతంలో నియామకాలు చేపట్టిన గ్రామ వాలంటీర్ పోస్టులకు సంబంధించి ఖాళీ అయిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబరు 10లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 16 నుంచి 20 వరకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు డిసెంబరు 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.

గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించి విద్యార్హతను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖాళీల భర్తీకి అవసరమైన పక్షంలో అర్హతలు తగ్గించే విషయాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. వాలంటీర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌ను అర్హతగా నిర్ణయిస్తే మిగిలిన ఖాళీలను సులభంగా భర్తీ చేయవచ్చన్నది సీఎం ఆలోచన. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేస్తారా అన్నది చూడాలి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు: 9,648.. శ్రీకాకుళం: 200.. విజయనగరం: 823.. విశాఖపట్నం: 370.. పశ్చిమగోదావరి: 590.. తూర్పు గోదావరి: 1,861.. కృష్ణా: 453.. గుంటూరు: 919.. ప్రకాశం: 592.. నెల్లూరు: 340.. చిత్తూరు: 678.. కడప: 891.. అనంతపురం: 955.. కర్నూలు: 976

Read MoreRead Less
Next Story