పూర్తిగా నిండిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.. గేట్లు ఎత్తివేత

పూర్తిగా నిండిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.. గేట్లు ఎత్తివేత

sriramsagar

తెలంగాణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మూడేళ్ల తర్వాత పూర్తిగా నిండింది. దీంతో అన్ని గేట్లు ఎత్తేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం.. మహారాష్ట్ర ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో దిగువకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో.. 42 గేట్లను ఎత్తి.. లక్షన్నర క్యూసెక్కల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇన్‌ఫ్లో.. 68 వేల 650 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం ఒక వెయ్యి 91 అడుగులు. దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలు కాగా.... ప్రస్తుతం 87 టీఎంసీలు నిల్వ ఉంది. ఇంకా.. 68 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండడంతో.. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. లక్షన్నర క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story