30 లక్షల మంది ఉపాధి కోల్పోయారు : పవన్ కళ్యాణ్

ఏపీలో ఇసుకకొరతపై ఘాటుగా స్పందించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. కొత్త ఇసుకు విధానం లోపభూయిష్టంగా ఉందన్న ఆయన... ఇసుక కొరతతో 30 లక్షల మంది కార్మకులు ఉపాధి కోల్పోయారని విమర్శించారు. ఏపీలో ఇసుక విధానం సరిగా లేదంటూ లారీల యజమానులు పవన్‌ కల్యాణ్‌ను కలసి తమ సమస్యలు చెప్పారు. కొత్తగా తెచ్చే 6వేల ఇసుక లారీలకు జీఎస్టీ తగ్గించేందుకు ప్రభుత్వం తెచ్చిన 486 జీవోపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తానని పవన్ స్పష్టంచేశారు. భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం నవంబర్ 3న విశాఖలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పవన్ స్పష్టంచేశారు. ఇసుక సరఫరా పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదని చెప్పారు పవన్‌ కళ్యాణ్.

అమరావతిలో కేపిటల్‌ కడాతారా.. లేదా..అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. నవ్యాంధ్ర రాజధానిపై పురపాలక మంత్రి బొత్స వెటకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాల వెనుక కోట్ల మంది ప్రజలు ఉన్నారనే విషయం మరిచిపోకూడదని పవన్ హితవు పలికారు. రాజధానిపై నెలకొన్న గందరగోళాన్ని ఆపాలని.. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జనసేనాని డిమాండ్‌ చేశారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.. సీఎం జగన్‌ను వ్యతిరేకించడమే పవనిజంగా కనబడుతోందని ఫైరయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని విమర్శించి, అధికారంలో ఉన్నప్పుడూ తమనే విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుతో లాలూచీ, జగన్‌తో పేచీనే పవన్‌ విధానంగా కనబడుతోందని పేర్ని నాని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం ఇచ్చిన జీవో 486 కోసం మోదీకి చెబుతానన్న పవన్‌.. రాష్ట్ర హక్కుల కోసం అప్పుడెందుకు ప్రధాని దగ్గరకు వెళ్లలేదని ప్రశ్నించారు. మొత్తానికి ఇసుకవిధానం, రాజధాని అంశంపై పవన్‌ ప్రశ్నిస్తుంటే... అటు ప్రభుత్వం మాత్రం....జనసేన అధినేతపై ఎదురుదాడి చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story