ప్రధాని మోదీ మెమొంటోలకు విశేష స్పందన

ప్రధాని మోదీ మెమొంటోలకు విశేష స్పందన

pm-modi

ప్రధాని మోదీకి వచ్చిన జ్ఞాపికల e-వేలం ముగిసింది. ఈ వేలంలో మెమొంటోలకు విశేష స్పందన వచ్చింది. మువ్వన్నెల పతాకం నేపథ్యంగా మహాత్మగాంధీ, మోదీతో ఉన్న అక్రిలిక్‌ పెయింటింగ్‌ అత్యధికంగా 25 లక్షల ధర పలికింది. అలాగే మోదీ తన తల్లి ఆశీస్సులు పొంతున్న ఫోటోకు వెయ్యి రూపాయలు నిర్ణయించగా అది వేలంలో 20లక్షలకు అమ్ముడుపోయింది. e-వేలంలో వచ్చిన సొమ్మును నమామి గంగామిషన్‌ నిధికి విరాళంగా ఇవ్వనుంది ప్రభుత్వం..

ప్రధాని మోదీకి వివిధ సందర్భాల్లో వచ్చిన 2 వేల 772 మెమొంటోలు వచ్చాయి .ఈ జ్ఞాపికల్లో పెయింటింగ్స్, శిల్పా లు, శాలువలు, జాకెట్లు, సంప్రదాయ సంగీత వాయిద్యాలు వంటి రకరకాలవి ఉన్నాయి . వీటన్నింటిని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 1 నుంచి వేలం వేయడం ప్రారంభించింది. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచింది. e-వేలంలో బాలీవుడ్ నటులు అనీల్‌కపూర్, అర్జున్‌కపూర్, గాయకుడు కైలాష్ ఖేర్ వంటి సెలెబ్రెటీలు, రాజకీయనాయకులు, వివిధ రంగాల ప్రముఖులు ఇ- వేలం లో పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story